Date : డిసెంబర్ 6, 2024
HYD CCMB: కరోనా లాంటి ప్రాణంతక వైరస్లను ఎదుర్కొనేందుకు CCMBశాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని కనిపెట్టారు. ఇక మీదట ఎలాంటి వైరస్కైనా వ్యాక్సిన్ ఈజీగా రెడీ చేయొచ్చంటున్నారు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ అనేది తెలుసుకుందాం. కొత్త వైరస్ను ఎదుర్కొనేందుకు ధీటుగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొత్తరకం ఎంఆర్ఎన్ఏను అభివృద్ధి చేశారు. ఈ ఎంఆర్ఎన్ఏతో కొత్త వైరస్లకు వ్యాక్సిన్ తయారు చేయడం సులభతరమని అంటున్నారు సీసీఎంబి శాస్త్రవేత్త డాక్టర్ మధుసూదన్ రావు. కరోనా వల్ల ఎన్నో జన్యుపరమైన మార్పులు వచ్చాయని వాటివల్ల కొత్త వైరస్లు పుట్టుకు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వాటికి వ్యాక్సిన్ తయారు చేయడానికి సంవత్సరకాలం పట్టేదన్నారు. కానీ ఈ ఎంఆర్ఎన్ఏతో నెల రోజుల్లోనే వైరస్లకు వ్యాక్సిన్ తయారు చేయవచ్చన్నారు.
This will close in 0 seconds